Analysis

BRS: బీఆర్ఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సిన టైమ్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..

BRS: బీఆర్ఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సిన టైమ్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills Bypoll) తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌ (BRS)కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) దారుణ ఫలితాలు, కంటోన్మెంట్ సిట్టింగ్ సీటును కోల్పోవడం వంటి వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన బీఆర్‌ఎస్‌కు, ఈ ఉపఎన్నిక తమ ఉనికిని నిరూపించుకోవాల్సిన అనివార్యతను తీసుకొచ్చింది. ఈ పోరును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) సతీమణి సునీతను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించారు.

ఎన్ని తల నొప్పులో!

ఈ ఎన్నికను బీఆర్‌ఎస్‌కు కత్తిమీద సాముగా మార్చడానికి అనేక అంశాలు కారణమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ ఎన్నికను తమ రెండో హైదరాబాద్ స్థానంగా గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు (Kalewaram Project)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న విమర్శలు, విచారణలు బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒకవైపు కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao) కాళేశ్వరం కేసులో చిక్కుకోగా, మరోవైపు కేటీఆర్‌కు ఈ ఎన్నిక ఒక పెద్ద సవాలుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేస్తున్న ఎత్తుగడలకు ఈ ముగ్గురు కీలక నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీకి అంతర్గతంగా ఎదురవుతున్న సవాళ్లు కూడా తక్కువేం లేవు. ఇవన్నీ ఒకెత్తయితే కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఎపిసోడ్ పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారింది. ఒకవేళ ఆమె తన ‘జాగృతి’ సంస్థ తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే పరిస్థితి ఏమిటి? పొరపాటున కవితనే పోటీచేస్తే ఎలా? అని పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ అంతర్గత విభేదాలు ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

బీజేపీతో సంబంధాలపై!

ఇక, బీజేపీతో బీఆర్‌ఎస్ లోపల మిత్రత్వం కోరుకునే వర్గం ఉందనే వార్తలు కూడా కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయి. కొందరు నేతలు బీజేపీతో చేతులు కలపడానికి ‘ఫేస్ యాప్’ ద్వారా ప్రయత్నించారనే విషయం తెలిసి కేసీఆర్ గుర్రుగా ఉన్నారట. ఈ అంశం కూడా పార్టీలో అంతర్గత గందరగోళానికి దారితీస్తోంది. అయితే, ఈ పరిణామాలను పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి బీఆర్‌ఎస్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి టీడీపీ (TDP)తో బీజేపీ కలిసినప్పటికీ, బీఆర్‌ఎస్ లోపల బీజేపీతో మిత్రత్వం కోరుకునే వర్గం ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి కూటమిగా వెళ్తే మాత్రం బీఆర్ఎస్‌కు మరొక సువర్ణావకాశం దొరికినట్లే అవుతుందని చెప్పుకోవచ్చు.

హైడ్రా ఇంపాక్ట్ ఎంత?

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) ను ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలోని బిల్డర్లను బెదిరింపులకు గురిచేస్తోందని, పేదల ఇళ్లను కూలగొడుతోందని బీఆర్‌ఎస్ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. ఈ అంశాలను ప్రచారం చేసి ప్రజల్లో సానుభూతిని కూడగట్టాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. వాస్తవానికి గత పదేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని, అనుమతుల్లో జాప్యం చేస్తున్నారని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో కొంతమంది బిల్డర్లకు చెందిన నిర్మాణాలను కూలగొట్టడం, లేనిపోని కారణాలతో ఇబ్బందులు పెట్టడం వంటివి జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యను బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడినవారు, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు అధికంగా ఉన్నారు. ఈ ఓటర్లను ఆకర్షించడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని, దీనివల్ల నగర అభివృద్ధికి ఆటం

సిట్టింగ్ సీటు కోల్పోతే..

జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్‌ఎస్‌కు ఎందుకంత కీలకంగా మారిందంటే, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే కాదు. బీఆర్‌ఎస్ తమ కంచుకోటగా భావించే హైదరాబాద్ నగరంలో సిట్టింగ్ కంటోన్మెంట్ సీటును ఇప్పటికే కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ను కూడా కోల్పోతే, అది పార్టీ నగరంలో బలహీనపడిందని సంకేతాలు పంపుతుంది. భవిష్యత్తులో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections), స్థానిక సంస్థల ఎన్నికలలో (Local body elections) పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని బీఆర్‌ఎస్ భయపడుతోంది. అందుకే, ఈ ఎన్నికను బీఆర్‌ఎస్ ‘లైఫ్ అండ్ డెత్ (Life and Death)’ సమస్యగా భావిస్తోంది. మాగంటి గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చడానికి, సునీతను భారీ మెజార్టీతో గెలిపించడం గోపీనాథ్‌కు సరైన నివాళి అవుతుందని కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లను బెదిరిస్తోందని, పేదల ఇళ్లను కూలగొడుతోందని ఆరోపిస్తూ, ఈ అంశాలను ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ అంశాలు సానుభూతిని కూడగట్టడమే కాకుండా, అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచుతాయని నమ్ముతోంది. ఈ సవాళ్లు, వ్యూహాల మధ్య జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారబోతోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 14, 2025 1:42 AM