అంత డ్యామేజ్ చూశాకైనా మారరా?
ఏపీలో అంత డ్యామేజ్‌ను చూశాకైనా మారరా? లేదంటే పిల్లిలా కళ్లు మూసుకున్నారా? పైగా ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో నానాటికీ బలపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయి.. ఏమాత్రం పట్టులేని బీజేపీ రెండవ స్థానానికి ఎగబాకుతోంది.

'అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం’ అన్నాడో కవి. కానీ ఒక్క జన్మకే సరిగా ఉండటం లేదు. ఇక జన్మజన్మలు ఎక్కడ? ఈగో, ఆర్థం, అధికారం అన్నీ తోడై అనుబంధాన్ని చిదిమేస్తున్నాయి. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయే ఉంటుంది. వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిల అనుకునేరు.. అది దాదాపుగా ముగిసిపోయిన కథ.. ఇప్పుడిప్పుడే తెలంగాణలో రాజుకుంటున్న కథ గురించి మాట్లాడుతున్నా. అనగనగా ఓ అన్నాచెల్లి. ఇద్దరినీ చూసిన వారు అన్నాచెల్లెళ్లంటే ఇలా ఉండాలని అనుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే ఈ చెల్లి ఆ అన్నకు కట్టిన రాఖీ వీడియోకు అదిరిపోయే పాటను జత చేసి అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ ఈసారి రాఖీ పండుగకు అన్న అమావాస్య చంద్రుడయ్యాడు. చెల్లి అవాక్కయ్యింది. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా.. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో..
అవును.. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఆయన సోదరి కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) గురించి.. వాస్తవానికి వీరిద్దరి అనుబంధాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందో.. అసలు ఇన్నర్‌గా ఏం జరిగిందో బయటకు రాలేదు కానీ అన్నాచెల్లెళ్ల విభేదాలు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చివరకు రాఖీ కట్టించుకునేందుకు కూడా కేటీఆర్ ఆసక్తి కనబరచలేదు. చల్లగా బెంగుళూరుకు వెళ్లిపోయారు. ఆ మధ్య కవిత జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన సందర్భంలోనూ ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపించారు. మరి ఇంతలోనే ఏమైంది? కవిత ఎందుకు తన తండ్రికి లేఖ రాయాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే ఇంట్లోనే చర్చించవచ్చు కదా.. అసలు వైరం అన్నతోనేనా? లేదంటే తండ్రితో కూడానా? కంటికి కనిపించని గట్టి కారణాలే వీరి మధ్య ఉన్నాయనేది మాత్రం స్పష్టం. వాస్తవానికి పార్టీ అధినేత కేసీఆర్ కవితకు పెద్దగా పదవులు అప్పగించింది కూడా ఏమీ లేదు. దీనికోసమే కవిత గట్టిగా పట్టుబట్టారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ వర్సెస్ కవిత (KTR Vs Kavitha) నడుస్తోంది.
సాధించింది ఏంటి?
అయినా సరే.. ఎన్ని ఉన్నా మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి. ఏపీనే చూస్తున్నాం కదా.. ఏం జరుగుతోందో.. చెల్లిని కాదన్న అన్న పరిస్థితి ఏమయ్యింది? ఏ ఆస్తి కోసమైతే చెల్లిని దూరం పెట్టారో.. అది మాత్రమే మిగిలింది. అధికారానికి దూరమై.. చివరకు 40 ఏళ్లుగా కంచుకోటగా నిలుపుకున్న సామ్రాజ్యం సైతం కూకటివేళ్లతో కూలిపోయింది. ఇక సాధించిందేమిటి? చెల్లి తోడుంటే అందలం ఎక్కేవాడని కాదులే కానీ మరీ అంత డ్యామేజ్ జరిగేది కాదేమో.. ఎంతో కొంత చెల్లి ప్రభావమైతే నిస్సందేహంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ తరుణంలో ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. చెల్లితో వైరం పెట్టుకుంటే రేపటి రోజున ఎన్నికల్లో జరిగితే ఆమె కూడా కొంత ఓట్ల శాతాన్ని చీలిస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఏదైనా కీడెంచి మేలెంచాలంటారు? ఇక ఇక్కడ మేలు ఎక్కడుంది? ఇదంతా చూస్తూ కూడా కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయినట్టు? ఆయనకు కూడా కూతురితో విభేదాలున్నాయా? లేదంటే కూతురు, కొడుకు మధ్యలోకి వెళ్లి ఎవరో ఒకరి సైడ్ స్టాండ్ తీసుకోలేక ఊరుకున్నారా? సమాధానం లేని ప్రశ్నలెన్నో..
చెల్లిని కాదంటే పరిస్థితేంటి?
అయినా సరే.. ఎన్ని ఉన్నా మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి. ఏపీనే చూస్తున్నాం కదా.. ఏం జరుగుతోందో.. చెల్లిని కాదన్న అన్న పరిస్థితి ఏమయ్యింది? ఏ ఆస్తి కోసమైతే చెల్లిని దూరం పెట్టారో.. అది మాత్రమే మిగిలింది. అధికారానికి దూరమై.. చివరకు 40 ఏళ్లుగా కంచుకోటగా నిలుపుకున్న సామ్రాజ్యం సైతం కూకటివేళ్లతో కూలిపోయింది. ఇక సాధించిందేమిటి? చెల్లి తోడుంటే అందలం ఎక్కేవాడని కాదులే కానీ మరీ అంత (11) డ్యామేజ్ జరిగేది కాదేమో.. ఎంతో కొంత చెల్లి ప్రభావమైతే నిస్సందేహంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ తరుణంలో ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. చెల్లితో వైరం పెట్టుకుంటే రేపటి రోజున ఎన్నికలు జరిగితే ఆమె కూడా కొంత ఓట్ల శాతాన్ని చీల్చే అవకాశం ఉందికదా.. అప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఏపీలో అంత డ్యామేజ్‌ను చూశాకైనా మారరా? లేదంటే పిల్లిలా కళ్లు మూసుకున్నారా? పైగా ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో నానాటికీ బలపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయి.. ఏమాత్రం పట్టులేని బీజేపీ రెండవ స్థానానికి ఎగబాకుతోంది. ఏదైనా కీడెంచి మేలెంచాలంటారు. ఇక ఇక్కడ మేలు ఎక్కడుంది? ఇదంతా చూస్తూ కూడా కేసీఆర్ (KCR) ఎందుకు సైలెంట్ అయినట్టు? ఆయనకు కూడా కూతురితో విభేదాలున్నాయా? లేదంటే కూతురు, కొడుకు మధ్యలోకి వెళ్లి ఎవరో ఒకరి సైడ్ స్టాండ్ తీసుకోలేక ఊరుకున్నారా? ఎవరో ఒకరు తగ్గాలి.. ఇప్పటికే ఇంటి గుట్టు వీధిన పడింది. రేపు ఇంకేమవుతుందో..!
ప్రజావాణి చీదిరాల